calender_icon.png 11 January, 2026 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీక్యురా రీస్కల్ప్ట్ ప్రారంభించిన డింపుల్ హయాతి

11-01-2026 01:37:20 AM

హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి కూకట్‌పల్లిలో సందడి చేసింది. తన కొత్త మూవీ రిలీజ్ లో బిజీగా ఉంటూనే కూకట్‌పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన వీక్యురా  రీస్కల్ప్ట్ ను ప్రారంభింటింది.  బ్యూటీ , స్కిన్ కేర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీకేర్ సాధారణ సౌందర్య చికిత్సలకు మించి ముందుకు సాగడానికి, శరీర పరివర్తనకు నిర్మాణాత్మక, సైన్స్-ఆధారిత విధానాన్ని అందించడానికి దీనిని తీసుకొచ్చింది. చెన్నైలో విజయవంతంగా ప్రారంభించిన తర్వాత, హైదరాబాద్ మార్కెట్‌లోకి ఈ బ్రాండ్ కార్యకలాపాలను విస్తరించింది. 

దీనిలో భాగంగా  అధునాతన, ఎఫ్డిఎ-ఆమోదించిన బాడీ కాంటౌరింగ్ మరియు వెల్నెస్ టెక్నాలజీలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా అంతర్గత కొవ్వు, కణాల ఆరోగ్యంపై కచ్చితమైన సమాచారాన్ని అందించే వైద్య ప్రమాణాల బాడీ కంపోజిషన్ ఎనలైజర్ ను తీసుకొచ్చారు. బాడీలో అనవసర కొవ్వు తగ్గింపు , శరీర ఆకృతి కోసం శస్త్రచికిత్స అవసరం లేని సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ గౌతమ్ తెలిపారు. తాము కేవలం స్కిన్ క్లినిక్ ను మాత్రమే ఏర్పాటు చేయలేదని, అత్యుత్తమ ప్రమాణాలతో అద్భుతమైన చికిత్సలు అందించే కేంద్రంగా దీనిని స్థాపించినట్టు వీక్యురా  రీస్కల్ప్ డైరెక్టర్ ఇ. కరోలిన్ ప్రభా రెడ్డి చెప్పారు.