28-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 27: నియోజకవర్గ అభివృద్దే నా ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పలు శాఖల అధికారులతో కలిసి చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఇబ్రహీంపట్నం చెర్వు కట్ట రూపు రేఖలు మారుతాయని, రూ. 18 కోట్ల వ్యయం తో చెరువు కట్ట సుందరీకరణ పనులు చేపట్ట నున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం నా బాధ్యత అని, ఇబ్రహీంపట్నం చెరువు కట్ట పైన జరుగుతున్న ప్రమాధాలను నివారించే క్రమంలో ఉప్పరిగూడా కూడలిలో అండర్ పాస్ లేదంటే ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, ఏఈ శ్రీనివాస్, ఆర్&బీ, ఎస్‌ఈ రవిశంకర్, హెచ్ ఎం డిఏ ఈఈ రజిత, హెచ్ ఆర్డిసిఎల్ ఈఈ మహబూబ్ మియా, పి ఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మున్సిపల్,కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ సునీత రెడ్డి , ఏసీపీ కేపీవీ రాజు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ మద్ది మహేందర్ రెడ్డి అధికారులు, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.