calender_icon.png 16 January, 2026 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

15-01-2026 12:08:08 AM

మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం

మొయినాబాద్, జనవరి 14(విజయ క్రాంతి): క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం అన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామంలో సురంగల్ ప్రీమియం లీగ్ సీజన్4 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను గ్రామానికి చెందిన యువ నాయకుడు, బీజేపీ మండల కార్యదర్శి గుమ్మల్ల సీతారాంరెడ్డి, ఆయన సోదరుడు గుమ్మల్ల విక్రంరెడ్డి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహించారు. టోర్నమెంట్లో నాలుగు జట్లు పాల్గొనగా, కెప్టెన్11 మరియు ఆర్కే రైస్ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్11 జట్టు ఎనిమిది పరుగుల తేడాతో ఆర్కే రైస్ జట్టుపై విజయం సాధించింది.

టోర్నమెంట్ విజేత జట్టుకు రూ.22,222 నగదు బహుమతి మరియు షీల్డ్ను, రన్నర్‌అప్ జట్టుకు రూ.11,111 నగదు బహుమతి మరియు షీల్డ్ను ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కేఎస్. రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కేఎస్. రత్నం మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల్లో గెలుపుఓటములు సహజమని, ఓటమిని గెలుపుకు నాదిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. క్రీడాస్ఫూర్తితో నిరంతరం సాధన చేస్తే క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం. శ్రీకాంత్, మహేష్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, ప్రభు యాదవ్, పోతుల రాజు యాదవ్, కొంగరి నారాయణరెడ్డి, ఎండి. షఫీ తదితరులు పాల్గొన్నారు.