calender_icon.png 3 February, 2026 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన క్లయిమ్ అమౌంట్ అందచేత

03-02-2026 05:20:42 PM

పెంచికల్ పేట్,(విజయక్రాంతి): మండలములోని ఎల్లూరు గ్రామానికి చెందిన డొకె. లక్ష్మి మరియు గోలేటి. దుర్గబాయ్, అనారోగ్యం కారణంగా చనిపోవడం తో వారికీ నామినిగా ఉన్న డొకె. నారాయణ, గోలేటి. రాజన్న, గార్లకి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు  మరియు దహేగాం సి.ఎఫ్.ఎల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి  బీమా యోజన  అమౌంట్ ని   వారికి ఇయ్యడం జరిగింది. ఈ సందర్భంగ బ్యాంకు మేనేజర్ గోపికిశోర్ మాట్లాడుతూ... “ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం అవసరం.

ముఖ్యంగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.2000తో పాలసీ తీసుకుంటే ప్రమాద మరణం జరిగితే నామినీకి రూ.40 లక్షల పరిహారం అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఇన్సూరెన్స్ చేసుకోవాలి” అని తెలిపారు.ఈ కార్యక్రమములో బ్యాంకు మేనేజర్ గోపికిశోర్,  ఆర్ బి ఐ, సి ఎఫ్. ఎల్ కౌన్సిలర్ రాజబాబు, శేఖర్, బ్యాంకు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.