15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎల్లూరు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనుల ప్రారంభం

03-02-2026 05:15 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): మండలంలోని ఎల్లూరు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులను గ్రామ సర్పంచ్ చెప్పిడే రవీందర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఉపాధి పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఒండ్రే ప్రేమనందం పాల్గొని ఉపాధి హామీ పనుల ప్రాధాన్యతను వివరించారు. గ్రామంలో పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయని తెలిపారు.

అలాగే గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు