కొలతల్లో తేడాలు వే బ్రిడ్జి సీజ్
19-04-2026 01:00 AM
గరిడేపల్లి, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ధాన్యం తూకాలలో వ్యత్యాసం చోటుచేసుకోవడంతో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో తాళ్ల మల్కాపురం గ్రామం శ్రీ వెంకటేశ్వర వే బ్రిడ్జిని సీజ్ చేసినట్లు జిల్లా కొలతలు, తూనికల అధికారి పీ నాగేశ్వరరావు తెలిపారు. శనివారం గరిడేపల్లి మండలంలోని తాళ్ళమల్కాపురంలో రైతుల ఫిర్యా దుపై స్పందించి వే బ్రిడ్జిని తనిఖీ చేసినట్టు తెలిపారు.
ఈ తనిఖీలలో ఒకలోడు ట్రాక్టర్‌కు 90 డిగ్రీల వ్యత్యాసం ఉన్నట్లు తూని కల కొలతలలో గుర్తించినట్లు తెలిపారు. ఇత ర వే బ్రిడ్జిలో కూడా తూకం వేసి నిర్ధారణ చేసినట్టు ఆయన తెలిపారు. రైతులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వేబిడ్జిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.






