సీఎంపై అసభ్య వ్యాఖ్యలొద్దు
19-04-2026 12:58 AM
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కేటీఆర్, హరీష్‌రావులు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేముందు పరిపక్వత సాధించాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నా రు. ప్రజలు అసభ్యకరమైన వ్యాఖ్యలు, స్థా యికి తగని మాటలను అంగీకరించరన్నారు.
ప్రజా సమస్యలను ఇద్దరు దృష్టి పెట్టాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించడం మానేసి వ్యక్తిగత వి మర్శలకు దిగడం బాధాకరమని, ప్రజాస్వామ్య విలువ లను కాపాడాలంటే ప్రతి నాయకుడు తాము మాట్లా డే మాటలపై నియంత్రణ పాటించాలని చెప్పారు. ఇలాంటి నిరాధార విమర్శలు మా నుకొని, నిర్మాణాత్మక రాజకీయాలకు సహకరించాలని మెట్టు సాయికుమార్ తెలిపారు.






