calender_icon.png 4 February, 2026 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్సిటీల్లో వివక్ష విద్యార్థికి చేటు

03-02-2026 12:00:00 AM

సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్ కాలేజీలంటే జ్ఞాన సముపార్జన కేంద్రాల్లా ఉండాలి. కానీ.. గత కొన్నేళ్లుగా ఈ సంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలు, కుల వివక్ష, సంస్థాగత నిర్లక్ష్యం వంటి సమస్యలకు నిలయా లుగా మారుతున్నాయి. ఇది కేవలం ఒకరి వ్యక్తిగత వైఫల్యం కాదు. సంస్థాగత సామాజిక సంక్షోభం. 2018 నుంచి 2025 మధ్య కాలంలో దేశావ్యాప్తంగా 98 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్లు అధికా రిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో 25 మంది సెంట్రల్ యూనివర్సిటీల్లో చెందినవారే కావడం విషాదం.

మొత్తం మరణా ల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారే. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) గణాంకాల ప్రకారం గడిచిన పదేళ్లలో విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షపై 118 శాతం పెరిగా యంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019 173 కేసులు నమోదు కాగా, 2023 నాటికి ఈ సంఖ్య 378కి చేరింది. మొత్తం 1,160 ఫిర్యాదుల్లో ఎస్సీ విద్యార్థులవి 65 శాతం, ఎస్టీలవి 15 శాతం, ఓబీసీలవి 20 శాతం ఉన్నాయి.

దేశంలోనే పురాతన వర్సిటీలుగా పేరున్న బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎక్కువగా బలవన్మరణాలు జరుగుతు న్నాయి. అలాగే కుల వివక్ష కూడా వర్సిటీల్లో పెచ్చరిల్లుతున్నది. వార్ధా హిందీ విశ్వవిద్యాలయంలో ఇటీవల కొందరు 10 మంది ఎస్సీ, ఓబీసీ విద్యార్థులను హాస్టళ్ల నుంచి బహిష్కరించారు.

ఐఐఎం అహ్మదాబాద్‌కు చెం దిన ఎస్టీ విద్యార్థి అక్షిత్ హేమంత్ భు క్యా, ఐఐఎం బెంగళూరుకు చెందిన ఓబీసీ విద్యార్థి నిలయ్ పటేల్ కుల వివక్ష ఎదుర్కొ ని ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలా గే కొన్నేళ్ల క్రితం మెడికల్ కాలేజీలో పాయల్ తడ్వి, హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీలో రోహిత్ వేముల బలవన్మరణాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి న సంగతి తె లిసిందే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు రిజర్వేషన్లు పొందడం కూడా ఆధిప త్య కులా లకు చెందిన వారు జీర్ణించుకోకపోవడం వ ల్లే ఈ వివక్ష కొనసాగుతున్న ది. ఇంకా కొం దరైతే ఆయా వర్గాలను సామాజికంగా బహిష్కరిస్తున్నారు. ఇది ఏ వికాసానికి సంకేతం?

బోధనారంగంలోనూ వివక్ష

పీహెచ్‌డీ, పీజీ కోర్సుల్లో కటాఫ్ మార్కు లు తగ్గించకపోవడం వల్ల దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ ఆయా కేటగిరీలకు వర్తించడం లేదు. ఇది రాజ్యాంగ సూత్రాలకు వి రుద్ధం. కేవలం విద్యార్థులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన ప్రొఫెసర్లు సైతం క్షేత్రస్థాయిలో కులవివక్షను ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రొఫెసర్ల ప్రాతినిధ్యం కేవలం 10 నుంచి 15 శాతం లోపే ఉందం టే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సెంట్రల్ విశ్వవిద్యాలయాల్లో 11,000కి పైగా ప్రొఫెసర్ పో స్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన పోస్టులను భర్తీ కావడం లేదు.ఈ తాత్సారంపై ఇప్పటికే పార్లమెంటరీ కమిటీ సైతం తప్పుబట్టింది.

దీనివెనుక ఆధిపత్యవర్గాలకు చెందిన వారే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రొఫెసర్లపై కుల వివక్ష ఆరోపణలు వచ్చాయి. పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం కేంద్ర విద్యాసంస్థల్లో దా దాపు 6,000కి పైగా రిజర్వ్ టీచిం గ్ పో స్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హతలు ఉన్నప్పటికీ ఓబీసీలను ‘అర్హత లేనివారు’ అని ము ద్ర వేసి తిరస్కరిస్తున్నారని కమిటీ పేర్కొంది.

ఐఐటీ ముంబైలో 91 శాతం మంది జనరల్ కేటగిరీకి చెందిన వారే ఉండగా, ఎస్టీ అధ్యాపకులు కేవలం 0.88 శాతం ఉన్నారంటే వివక్ష తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఐఐటీ ఇండోర్‌లో 97 శాతం జనరల్ కేటగిరీకి చెం దిన వారే ఉండగా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెం దిన ఒక్క ప్రొఫెసర్ కూడా లేకపోవడం దేని కి సంకేతం. ఈ గణాంకాలన్నింటినీ  చూ స్తుంటే ఐఐటీలు, ఐఐఎంలు ఆధిపత్యవర్గాలకు అనుకూలంగా వ్యవహరించే సంస్థలు గా మారుతున్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యాసంస్థల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు దాపురిం చాయి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల బలవన్మరణం తర్వాత, కాస్త పరిస్థితులల్లో మార్పలు వచ్చినప్పటికీ, అడ్మిషన్లు, గైడ్స్ కేటాయింపులో యాజమాన్యం వివక్ష చూ పుతతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మ రణాల పరం గా చూస్తే, తెలంగాణ జాతీయ సగటులో టాప్ స్థానంలో ఉంది.

ఈ బలవన్మరణా లు కేవలం పరీక్షల ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎక్కువ బలవన్మరణాల్లో వారి సామాజిక నేపథ్యమే, వారి చావుకు కారణమవుతున్నాయని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. ఈ గణాంకాలన్నింటినీ కే వలం అంకెలు, సంఖ్యలు అని యాజమాన్యాలు భావించకుండా, ప్రతి విద్యార్థి ప్రా ణానికి విలువనిచ్చే విద్యావ్యవస్థను నిర్మించడం ఇప్పుడు ఎంతో అవసరం.

విద్యార్థుల మానసిక సంఘర్షణ 

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష, సా మాజిక వివక్ష ఎదుర్కొనే విద్యార్థులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు. అట్ట డుగు వర్గాల నుండి ఎన్నో కలలతో ఈ సంస్థల్లో అడుగుపెట్టిన వారు తమ మేధ స్సు కంటే సామాజిక నేపథ్యం ఆధారంగా చిన్నచూపుకు గురైనప్పుడు వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తోటి విద్యార్థుల వెలివేత, ప్రొఫెసర్ల పక్షపాత వైఖరి, రిజర్వేషన్ల పేరుతో చేసే ఎగతాళి వారిలో తీవ్ర మైన ఒంటరితనాన్ని, నిస్సహాయతను నిం పుతాయి.

మానసిక వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, అలాంటి వివక్షను ఎదు ర్కొంటున్న విద్యార్థులు నిరంతరం ‘ఇంపొస్టర్ సిండ్రోమ్స అనే మానసిక స్థితిలో ఉం టారు. అసలు తమకు ఇంత పెద్ద వర్సిటీకి వచ్చి చదువుకునే అర్హత ఉందా? అనే ఆత్మన్యూనతకు గురవుతారు. చుట్టూ ఉన్న వాతావరణం శత్రుపూరితంగా మారినప్పు డు, ప్రతి చిన్న వైఫల్యం కూడా ఒక పెద్ద వి పత్తులా కనిపిస్తుంది.

వ్యవస్థాగత మద్దతు లేకపోవడం, సమస్యను చెప్పుకునే నాథు డు కరువవ్వడం వల్ల వారిలో తీవ్రమైన కుంగుబాటు మొదలవుతుంది. మానసిక సంఘర్షణ పరాకాష్ఠకు చేరినప్పుడు, తా ము అనుభవిస్తున్న అవమానానికి ఆత్మహత్యే ఏకైక పరిష్కారమనే నిర్ణయానికి వస్తారు. తన అస్తిత్వాన్ని సమాజం గుర్తించడం లేదనే భావన, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం వంటి పరిస్థితులు ఒక విద్యార్థిని బలవన్మరణానికి పురికొల్పుతాయి

 వ్యాసకర్త సెల్: 9963240519