25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
17-04-2026 01:51 PM
ఎస్ఓటి పోలీసుల దాడులు
షాద్‌నగర్ ఏప్రిల్ 17 (విజయక్రాంతి): జిల్లేడు చౌదరిగూడెం మండలంలో ఎస్ఓటి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకున్నారు. సుమారు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దాడుల్లో భాగంగా బియ్యాన్ని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠా పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






