కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు
న్యూఢిల్లీ: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy ) ఢిల్లీలో ఎన్డీఎస్ఏ అధికారులతో భేటీ అయ్యారు. ఐఐటీ ముంబయితో కలిసి బ్యారేజ్ మరమ్మతులు చేపడుతున్నారని పేర్కొన్నారు. బ్యారేజ్ మరమ్మతుల విషయమై రెండ్రోజులపాటు చర్చలు జరిపామని తెలిపారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకే ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.
మూడు బ్యారేజీలు, భూపరీక్షలు, డిజైన్లపై కేంద్ర మార్గదర్శకాల మేరకు వెళ్తున్నామని సూచించారు. పరీక్షల కోసం సీడబ్ల్యూసీ పీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ సంస్థను ఉపయోగించామని తెలిపారు. సీడబ్ల్యూసీ పీఆర్ఎస్ డైరెక్టర్(CWC PRS Director) కూడా ఎన్డీఎస్ఏ చర్చల్లో పాల్గొన్నారని స్పష్టం చేశారు. వర్షాలు, వరదలు వచ్చేలోగా భూమి పరీక్షలు, డిజైన్లు ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Project) విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు తెలంగాణ ప్రజలందరికీ తెలుసని వివరించారు.






