3 March, 2026 | 9:05 PM

ఆట,పాట ప్రోగ్రాంలో నాగసానిపల్లి గ్రామ వాసి

03-03-2026 12:38 AM

శ్రీరంగపురం మార్చి 2: ప్రజాదరణ పొందిన పల్లెపాటల కార్యక్రమం ఆట పాటలో క్వార్టర్ ఫైనల్కు శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన అరుణ ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణంగా మారింది. అరుణ తన మధుర స్వరంతో, సంప్రదాయ పల్లెపాటలను హృదయానికి హత్తుకునేలా ఆలపిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామ యువతకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.