నేడు ఉపకరణాల పంపిణీ
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా నిర్మల్ ఆధ్వర్యంలో, ALIMCO సహకారంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (CwSN) ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరం బుధవారం నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. NTR మినీ స్టేడియం, నిర్మల్‌లో నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రత్యేక విద్యా వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఇంతకుముందే గుర్తించిన దివ్యాంగ విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలు ట్రై-సైకిల్, వీల్‌చైర్, సీపీ చైర్, హియరింగ్ ఎయిడ్, బ్రెయిలీ కిట్, బ్రెయిలీ స్లేట్, కేన్, క్రచెస్, టీ ఎల్ ఎం కిట్ మొదలగు ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఉపాధ్యాయులు మరియు IERP లు విద్యార్థులకు సమాచారం అందించి, తల్లిదండ్రులు, CwSN విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు.






