ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
12-05-2026 06:55 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి దయానంద్ తెలిపారు. 2026 27 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ బీసీ కులాలకు చెందిన వారు కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీలను కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాల కోసం ప్రభుత్వమే ఉచిత విద్య వసతి సౌకర్యం కల్పిస్తుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినించుకోవాలని కోరారు.






