4 August, 2026 | 1:47 AM

శాతవాహనకు మరో రెండు స్వర్ణ పతకాలు

04-08-2026 12:00 AM

కొత్తపల్లి, ఆగస్టు 3 (విజయ క్రాంతి): శాతవాహన యూనివర్సిటీకి మరో రెండు స్వర్ణక పతకాలు లభించాయి. శాతవాహనవీసీ అమెరికా పర్యటన సందర్భంగా ఆట సదస్సులో ఇద్దరు ఎన్నారైలు తమ చెరో స్వర్ణ పతకాన్ని శాతవాహన విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వారిలో ఒకరు న్యూయార్క్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వి రాజశేఖర్ రెడ్డి కాగా, మరొకరు వాషింగ్టన్ డీసీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బి. రవీందర్ రెడ్డి. ఈ సందర్భంగా పలువురు వర్షం వ్యక్తం చేశారు.