18 August, 2026 | 3:35 AM

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు దుస్తుల అందజేత

18-08-2026 02:00 AM

దోమకొండ, ఆగస్టు 17 (విజయక్రాంతి):  దోమకొండ మండల కేంద్రంలోని బోడపుంటి లావణ్య, సాకలి భార్గవి-రాజు సోమవారం నూతన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తిరుమల్ గౌడ్ ఇద్దరు లబ్ధిదారులకు బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహకారంతో దోమకొండ గ్రామంలో 161 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు.

పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనంతరెడ్డి, మధు, గోపాల్రెడ్డి, నర్సింలు, షమ్మీ, నయీం, నరేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.