20 March, 2026 | 6:20 AM

ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ

20-03-2026 12:24 AM

తాడ్వాయి, మార్చి, 19( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుస్తులు పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందించిన దుస్తులను నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను సముచితంగా చూస్తుందని తెలిపారు.

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేసి అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. మండలంలోని కృష్ణాజివాడి, ఎర్ర పహాడ్, దేమి కలాన్,కరడ్ పల్లి, చందాపూర్, బ్రాహ్మణపల్లి, చిట్యాల, సంతాయిపేట గ్రామాలలో దుస్తులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు ఆకిటి వెంకట్ రామ్ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు, జంగం రాజు, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు