అదిగో చిరుత.. -వణుకుతున్న ప్రజలు
పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు
జుక్కల్ మార్చి 19 (విజయ క్రాంతి): గత రెండు నెలలుగా చిరుత పులి జుక్కల్ మండలంలోని ప్రజలకు వణికిస్తోంది. మండలంలోని డోన్గాం, బంగరుపల్లి, దోస్త్ పల్లి, పెద్దగుల్ల, పెద్ద ఏడ్గి, గుండూర్, బస్వాపూర్ గ్రామ శివారులో చిరుత పులి లేక దూడలను మేక పిల్ల లను కుక్కలను చంపి తినేస్తుందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి ఏదో ఒక కనిపించింది అంటూ ప్రజలు చెబుతూనే ఉన్నారు.
ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు కానీ వారు రావడం చూసి పోవడం వరకే సరిపోతుంది. కానీ ఫారెస్ట్ అధికారులు చేసింది ఏమీ లేదని వాటిని పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శిస్తున్నారు. బంగారు పల్లి గ్రామంలో బుధవారం రాత్రి కొట్టంలో కట్టేసిన లేక దూడను చంపి తినేసిందని బాధితుడు ఇంగ్ళే హుల్బా ఉదయం ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అరెస్టు అధికారులు వచ్చి పరిశీలించగా నిజంగానే చిరుత పులి దాడి చేసిందని వారు చెప్పారు. ఇదే గ్రామంలో రెండు నెలల క్రితం ఒక చిరుత పులి చనిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటినుంచి ఇప్పటివరకు పలు గ్రామాల్లో మేక పిల్లలు గొర్రెల పిల్లలు తోపాటు పశువులను వెంటాడుతూనే ఉంది. పెద్ద గల్లలో ఒక కుక్కను చంపేసింది. డోన్గాంలో ఒక లేగదూడను మరో కుక్కను కూడా చంపిందని గ్రామస్తులు గ్రామస్తులు తెలిపారు. దోస్పల్లి శివారులో ఒకటి అదేవిధంగా బస్వాపూర్ శివారులో గొర్రెలను చంపినట్లు ప్రజలు చెబుతున్నారు.
పెద్ద ఏడ్గి గ్రామంలో నెలరోజుల క్రితం డ్రోన్ కెమెరా సహాయంతో వెతికి చూశారు కానీ దాని జాడ కనిపించలేదు. ఇక్కడ కూడా మాదేవ్ మందిర వెనకాల ఒక లేగ దూడను బలి తీసుకుంది. ఇంత జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు చూస్తున్నాం చేస్తున్నామంటూ కాలం వెళ్లదీస్తున్నారే కానీ చేసింది ఏమీ లేదంటూ ప్రజలు వాపోతున్నారు. బీట్ ఆఫీసర్ నుంచి జిల్లా ఫారెస్ట్ అధికారికి తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని చెబుతున్నారు. బీట్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్లు, డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు తప్పుపడుతున్నారు.
గతంలో చిరుతపులి చనిపోయిందని ఒక వ్యక్తి అతనితో పాటు మరో వ్యక్తిని కూడా ఫారెస్ట్ సెక్షన్ ల ప్రకారం పొలంలో చనిపోయినందున వారికి జైలుకు కూడా పంపించారు. చిరుతపులి చనిపోతే ప్రజలకు జైల్లో పెడుతున్నారు మరి ప్రజలకు చిరుతపులులు దాడి చేసి చంపితే ఎవరికి జైల్లో పెట్టాలని ప్రజలు అధికారులకు నిలదీస్తున్నారు. అయితే గురువారం ఉదయం నుంచి చనిపోయిన లేగ దూడ వద్దని గ్రామస్తులంత గుమిగూడి అధికారులు వచ్చేంతవరకు దానిని పూడ్చి పెట్టమని తెగేసి చెప్పారు.
ఏ అధికారికి చెప్పిన ఎవరు ఈ రోజు రారని జుక్కల్ రేంజ్ ఫారెస్ట్ పెద్ద కొడప్గల్ బీట్ అధికారి రామచందర్ చెప్పడం గమనార్హం. చనిపోయిన లేగదూడకు పంచనామ నిర్వహించడానికి సంబంధిత వెటర్నరీ డాక్టర్ కూడా రాలేదని బాధితుడు వాపోయాడు. వెటర్నరీ డాక్టర్ లేకుండా ఇతరులు పంచనామ ఎలా నిర్వహిస్తారని వారు తప్పుపట్టారు. సుమారు మధ్యాహ్నం వరకు అలాగే ఉంచారు.
తాము పెంచుకుంటున్న పశువులను ఈ విధంగా చిరుత పులి బలి తీసుకుంటుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమకు జీవన ఆధారమైన ఎడ్లు, మూగజీవాలు చనిపోవడం పట్ల వారు బాధ వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ ప్రాంతంలో సంచరిస్తున్న ఆ చిరుత పులిని ఎలాగైనా సరే పట్టుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.




