31 May, 2026 | 10:43 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

08-04-2026 12:48 AM

నిజాంసాగర్ ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామానికి చెందిన వేముల విట్టల్, బంజపల్లి గ్రామానికి చెందిన సమీర్కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం రోజు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందించడం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి పథకాలను వినియోగించుకుని తమ సమస్యలను అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాపండరి, జనార్దన్ రెడ్డి, సంకు లక్ష్మయ్య, శ్రీనివాస్, మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.