8 April, 2026 | 2:42 AM

జుక్కల్ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు తగవు

08-04-2026 12:47 AM

తానాజీ పటేల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం

నిజాంసాగర్ ఏప్రిల్ 7(విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  పై యూట్యూబ్ ఛానెల్‌లో జర్నలిస్టు తానాజీ పటేల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నిజాంసాగర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా పండరి, సర్పంచులు, ఉప సర్పంచులు తీవ్రంగా స్పందించారు.

మంగళవారం నాడు నిజాంసాగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో ఎఐ సిసి పరిశీలకు లుగా పాల్గొంటూనే జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారన్నారు. అలాంటి నాయకుని పై అసత్య ఆరోపణలు చేయడం తగదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధులపై నిరాధార ఆరోపణలు చేయడం, వ్యక్తిగతంగా దూషించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని, అలాంటి నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం తగదని అన్నారు. అలాగే, తనజీ పటేల్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి,శ్రీనివాస్, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.