9 April, 2026 | 3:10 AM

నిజాంసాగర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

09-04-2026 01:04 AM

నిజాంసాగర్, ఏప్రిల్ 08 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) లబ్ధిదారులకు చెక్కుల ను డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్  బుధవారం నాడు అందించారు. మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కాషా గౌడ్, మంగ్లూర్ గ్రామానికి చెందిన నంగి భూమవ్వకు అందించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందించే ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలు ఇలాంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.