ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్
దేవరకొండ, ఏప్రిల్ 8 : ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ 8500 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలనీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో బకాయిలను వెంటనే అందించాలని కోరుతూ దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 8500 కోట్లు తక్షణమే విడుదల చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
హైకోర్టు విద్యార్థుల నుంచే ఫీజులను వసూలు చేయాలనే తీర్పు పేద విద్యార్థులకు విద్యకు దూరం చేసే విధంగా ఉందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పున్న వెంకటేష్ నేత, డబ్బే కార్ పెంటోజి, గిరి వెంకటయ్య గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు సహదేవ్, బుర్రి వెంకన్న, బొమ్మగాని శివ గౌడ్, చేరిపల్లి జయలక్ష్మి, పున్న భిక్షమయ్య , భీమ గోని శివ గౌడ్, బొమ్మ శ్రీనివాస్ యాదవ్, లావుడియా భాష నాయక్, జిల్లా రాములు, యాదయ్య చారి, లలిత, రమణ, తదితరులు పాల్గొన్నారు.




