9 April, 2026 | 3:09 AM

10న ఆయుష్ మెగా ఉచిత ఆరోగ్య వైద్యశిబిరం

09-04-2026 01:06 AM

కామారెడ్డి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో ఈ నెల 10న ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయుష్ దినోత్సవం వేడుకలు ఎన్జీవోస్ కాలనీలో ఆయుష్ కార్యాలయం ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా హోమియోపతి, ఆయుర్వేదం, యునాని పరీక్షలు జరుపనున్నట్లు తెలిపారు. ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు యోగా నిర్వహణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, 14వ వార్డ్ ప్రజలు హోమియో పతి, యునని, ఆయుర్వేద పరీక్షలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగవాన్, వైద్య అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి, ఆయుర్వేద, యునాని, యోగా డాక్టర్స్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జునేద్ బేగం, డాక్టర్ విజయ, డాక్టర్ దేవయ్య, ఫార్మసిస్ట్ కిషోర్, యోగా మాస్టర్ బాల్ లింగం పాల్గొన్నారు.