18 August, 2026 | 4:25 PM

Breaking News

సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •   బహుజనుల రాజ్యస్థాపనే లక్ష్యం   •   సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు   •   ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మార్వో   •   బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి   •  

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ : జిఎం షాలెం రాజు

11-05-2026 07:41 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): రుద్రంపూర్ సిఈఆర్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన స్టడీ రూమ్‌లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాల పంపిణీ జిఎం చేతుల మీదుగా జరిగింది. అనంతరం జీఎం  మాట్లాడుతూ, అభ్యర్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదల మరియు నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ  యువత అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో, చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు, అవసరమైన అధ్యయన వాతావరణాన్ని కల్పించేందుకు, ఇటువంటి స్టడీ రూమ్‌లు , పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల  అభివృద్ధి కోసం పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో, కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు ,తీసుకున్న ప్రత్యేక చొరవను యూనియన్ నాయకులు కొనియాడారు. అభ్యర్థులకు  అధ్యయన వాతావరణం కల్పిస్తూ వారి భవిష్యత్తు పురోగతికి, సింగరేణి యాజమాన్యం అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం  షాలెం రాజు తో పాటు, ఎస్‌ఓ టు జీఎం ,కోటి రెడ్డి , ఏరియా సేఫ్టీ ఆఫీసర్ , ముక్కపాటి వెంకటేశ్వర్లు, పర్సనల్ మేనేజర్ , తిరుపతి , (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి శ్రీ వి. మల్లికార్జున రావు , (ఐఎన్‌టీయూసీ) వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం.డి. రజాక్ , (ఐఎన్‌టీయూసీ) పిట్ కార్యదర్శి సాగర్  ఇతర అధికారులు, అభ్యర్థులు పాల్గొన్నారు.