సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ట్రైబల్ TG.TWURJC బాలికల హాస్టల్ లో మంగళవారం షీ టీం ఆధ్వర్యంలో ఏఎస్సై తులసిరాం, పీసీ చాంగు భాయి ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యార్థినిలకు బాలికల భద్రతతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, యువతులు ఎదుర్కొనే వేధింపులు, ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు. అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షీ టీం సేవలను అవసరమైన సమయంలో వినియోగించుకోవచ్చని, మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సిబ్బంది తెలిపారు.
మహిళలు, బాలికల రక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ప్రకారం, షీ టీమ్స్ మహిళలపై ఆన్‌లైన్, ఫోన్ వేధింపులు సహా పలు సమస్యలపై జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు షీ టీం స్పందిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలాగే Child helpline number 1098, Women helpline number 181, Cyber helpline number 1930, Police helpline number 112, She Team helpline number 9121610750 కు సంప్రదించాల్సింది కోరారు.
ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిల వెంటపడితే, ఆట పట్టించడం, ర్యాగింగ్ చేయడం, అమ్మాయిల, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల, కళాశాల, బస్ స్టాప్ లలో షీ టీం మస్తీలో పర్యవేక్షిస్తూ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇంస్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్ ఆన్లైన్ పై సైబర్ క్రైమ్ పోలీసులు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది, మీరు చూసిన హిస్టరీ డిలీట్ చేశామనుకోవడం పొరపాటని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిర్గాపూర్ ఎస్సై-2 నారాయణ, రాధికా పోలీస్ సిబ్బంది, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






