18 August, 2026 | 4:41 PM

Breaking News

ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •   బహుజనుల రాజ్యస్థాపనే లక్ష్యం   •   సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు   •  

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

18-08-2026 04:09 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. BSP రుద్రంగి మండల అధ్యక్షులు దయ్యాల ఉదయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి కట్కూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నాయకులు పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, ఆయన పోరాటం, సామాజిక దృక్పథం, అణగారిన వర్గాల కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్న గౌడ్ అని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాకుండా, సామాజిక అసమానతలను ప్రశ్నించిన ధైర్యశాలి అని అన్నారు. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం, సమానత్వం, స్వాభిమానం ఉండాలని తన పోరాటం ద్వారా చాటి చెప్పారని పేర్కొన్నారు.

పాపన్న గౌడ్ చరిత్రను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, ఆయన పోరాట స్ఫూర్తిని యువతలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు.BSP సీనియర్ నాయకులు కట్కూరి శంకర్ మాట్లాడుతూ.. చరిత్రలో అణగారిన వర్గాల నుంచి ఎదిగిన మహనీయుల త్యాగాలు, పోరాటాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

పాపన్న గౌడ్ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు దయ్యాల ఉదయ్ మాట్లాడుతూ.. రుద్రంగి మండలంలో బహుజన మహనీయుల జయంతి వేడుకలను నిరంతరం నిర్వహిస్తూ వారి చరిత్రను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. యువతలో చారిత్రక అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.