30 August, 2026 | 8:38 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఎంపీపీఎస్ అచ్చంపేటకు 30 డ్యూయల్ డెస్కుల పంపిణీ

14-07-2026 02:08 PM

నిజాంసాగర్ జూలై 14(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ సహకారంతో లిటిల్ రెడ్ జాంబీస్ సంస్థ 30 డ్యూయల్ డెస్కులను అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. లాల్ సింగ్ తెలిపారు. అయన చేసిన అభ్యర్థన మేరకు ఈ డెస్కులను పాఠశాలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డి. లాల్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేందుకు ఈ డ్యూయల్ డెస్కులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ మరియు లిటిల్ రెడ్ జాంబీస్ సంస్థ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సహాయం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.