30 August, 2026 | 10:57 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

పసిపిల్లల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం దృష్టి

14-07-2026 02:11 PM

బోథ్. జులై 14 (విజయక్రాంతి): పసి పిల్లల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పిల్లలు ఆరోగ్యంగా పెరిగితే బంగారు భవిష్యత్తు ఉంటుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ సర్పంచ్ కురుమే అన్నపూర్ణాల పేర్కొన్నారు మంగళవారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో తొలిముద్దు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పిల్లలకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు తొలిముద్దు ఆరోగ్యానికి బాట వేస్తుందని పేర్కొన్నారు ఈ పథకాన్ని సక్రమంగా లోటు పాట్లు లేకుండా అమలు చేయాలని కోరారు సిడిపిఓ నరసమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అంగన్వాడి కేంద్రాలలో సమర్థవంతంగా నిర్వహించే విధంగా చూస్తామన్నారు ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం నిర్వాణపై నిర్లక్ష్యం వహించవద్దని నిర్లక్ష్యం చేస్తే వేటు పప్పలన్నారు కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు