14 April, 2026 | 5:12 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

07-02-2026 08:54 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఉప సర్పంచ్ గౌరిగారి కార్తిక్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు శనివారం పరీక్ష సామగ్రిని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదినం సందర్భంగా, అలాగే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని విద్యార్థుల భవిష్యత్తుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని గ్రామస్తులు పేర్కొంటూ ఉప సర్పంచ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.