15 March, 2026 | 7:25 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి

07-02-2026 08:57 PM

రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్

పాపన్నపేట: సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, పిఆర్సి కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని,  పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని, టెట్ రద్దు  అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తామని, జిపిఎఫ్ వెంటనే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలు నెరవేర్చకపోతే రాష్ట్ర రాజధానిలో ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.