calender_icon.png 14 May, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలింతకు ఎక్స్‌పైరీ కిట్ పంపిణీ

14-05-2025 12:00:00 AM

పోలీసులకు ఫిర్యాదు

కార్వాన్, మే 13: గోల్కొండ ఏరియా హాస్పిటల్‌లో గడువు ముగిసిన కిట్లను బాలింతలకు పంపిణీ చేశారు. అధికారులను ప్రశ్నిస్తే స్పందించకపోవడంతో బా ధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకా రం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన రాహుల్ శర్మ భార్య స్థానిక గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

వైద్యులు మందుల కిట్ ను అంద జేశారు. కిట్ ను పరిశీలించగా దాని గడు వు ముగియడంతో సంబంధిత అధికారులను ఆస్పత్రిలో పరిశీలించగా సమాధా నం ఇవ్వలేదు. దింతో వారు స్థానిక పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

ఒకటి వచ్చింది.. సూపరింటెండెంట్

ఆసుపత్రిలో బాలింతకు అందజేసిన కిట్ గడువు ముగియడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తన దృష్టికి వచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒక కిట్ వచ్చిందని, దాన్ని పరిశీలిస్తు న్నామన్నారు. తమ సిబ్బంది పీఎస్ లో మాట్లాడారని, అది అంత పెద్ద విషయం కాదని చెప్పడం గమనార్హం.