24 July, 2026 | 3:07 PM

కేటీఆర్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

24-07-2026 02:34 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, నాయకులు వెంకన్న, సలాం, పోచయ్య, అశోక్, నిసార్, హైమద్, షకీర్, ఆన్సర్, రవి, జయరాజ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.