అణచివేతపై గళమెత్తిన చేర్యాల బీఆర్‌ఎస్‌వీ నాయకులు
24-07-2026 02:51 PM
చేర్యాల: ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ కొనసాగిస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసనలో చేర్యాల ప్రాంత విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. బిఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ ఆధ్వర్యంలో తరలివెళ్లిన నేతలు విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ సంఘీభావం తెలిపారు. విద్యార్థుల పోరాటానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం, న్యాయవాది రవికుమార్, ఉప సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు బంగారుగళ్ల కిరణ్, తాండ్ర సాగర్, ఎర్రోళ్ల యాదగిరి, పోలోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






