నేడు సబ్సిడీపై జనుము విత్తనాల పంపిణీ
21-05-2024 01:36 AM
జహీరాబాద్, మే 20 : వానాకాలం సీజన్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్టు జహీరాబాద్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భిక్షపతి తెలిపారు. మంగ ళవారం పట్టణంలోని సహకార సం ఘం కౌంటర్ కార్యాలయంలో 40కిలో ల బస్తా సబ్సిడీపై రూ. 1448లకు రైతులకు అందజేశామని తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ వెంట ఆధార్‌కార్డు, పట్టాపాస్‌బుక్కు జీరాక్స్ పత్రాలను తీసుకురావాలన్నారు. తొలకరి వర్షాలు మొదలైన తర్వాతే విత్తనాలను విత్తుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






