అక్రమంగా మట్టి తరలింపు
చెరువులు, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు
పట్టించుకోని అధికారులు
జహీరాబాద్, మే 20 : జహీరాబాద్ నియోజకవర్గంలోని అక్రమార్కులు అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతోనే చెరువులు, ప్రభుత్వ భూముల్లో యథేచ్చగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారే ఆరోపణలు వస్తున్నాయి. కొందరూ అక్రమార్కులు మట్టిని ఇటుకబట్టీలు, పొలాలకు తరలించి సోమ్ము చేసుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని హద్నూర్ పెద్ద చెరువు, జహీరాబాద్ మండలం దిడిగి, శేఖాపూర్ గ్రామాల్లో ఉన్న చెరువులు, ప్రభు త్వ భూముల్లోని సారవంతమైన మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఇప్పటికైన అధికారులు చర్యలు తీసుకోని మట్టి తరలింపును అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజ లు కోరుతున్నారు. ఈ విషయమై న్యాల్‌కల్ తహసీల్దార్ భూపాల్ వివరణ కోరగా అక్రమ మట్టి తరలింపును అడ్డుకుంటామని, అనుమతి లేకుండా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.






