ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో యాదాద్రి కలెక్టర్ హనుమంత్ కే జండగే
యాదాద్రి భువనగిరి, మే 20( విజయక్రాంతి): నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టబద్రుల ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారు లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత్ కే జండ గే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టార్, ఎఫ్‌ఎస్‌టీ, వీడి యో టీమ్స్, ఎంసీసీ టీమ్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచన లు చేశారు. ఈనెల 27వ తేదీన పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాల్లో జరుగుతుందన్నారు.
భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 34,080 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను 12 మంది సెక్టార్ ఆఫీసర్లు, 6 ఫ్లుయింగ్ స్కాడ్ టీములు, 17 స్పెషల్ వీడియో టీములు, 17 ఎంసీసీ టీములు పర్యవేక్షిస్తాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా సెక్టార్ ఆఫీసర్లు చూడాలని, బీఎల్‌వోల ద్వారా ఓట రు స్లిప్స్ పంపిణీ చేయాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలకు సకాలంలో మెటీరియల్ చేరేలా, ఎన్నికలు పూర్తయిన అనంతరం మళ్లీ రిసిప్షన్ సెంటర్‌కు చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రతి కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గురు అసిసెంట్లు విధులు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమిం చకుండా నిఘా టీమ్‌లు క్షేత్రస్థాయిలో పటిష్టంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో అమరేందర్, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్ నర్సిరెడ్డి, హరినాధ్‌రెడ్డి పాల్గొన్నారు.






