30 June, 2026 | 1:46 AM

వెంకటాపూర్‌లో ఇమిగ్రేషన్ ఫారమ్స్ అందజేత

30-06-2026 12:00 AM

బాలాపూర్, జూన్ 29 (విజయక్రాంతి):  మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ఇమిగ్రేషన్ ఫారమ్స్ అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిల్వేరి సాంబశివ పాల్గొని, బీఎల్‌ఓ కాల్వ శ్రీకాంత్, బీఎల్‌ఏ కడారి సురేష్ యాదవ్ సమక్షంలో శానవాస్ ఖాన్ కుటుంబ సభ్యులకు ఫార్మ్స్ను అందజేశారు. ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్న ఈ సందర్భంగా, ప్రజలకు అవసరమైన సేవలను సమర్థవంతంగా అందించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.