నిబంధనలు పాటించని వారిపై చర్యలు
ఇబ్బంది కూడా తమ పరిధిని దాటకూడదు: ఎక్సైజ్ సూపరింటెంట్ ముకుంద రెడ్డి
కామారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): కల్లు మూస్తే దారులు ఎక్సైజ్ నిబంధనలను పాటించాలని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. కామారెడ్డిలో పనిచేసిన ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావు మల్కాజిగిరి మేడ్చల్ జిల్లాకు బదిలీపై వెళ్లారు.
ఆయన స్థానంలో ముకుంద రెడ్డి మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా నుంచి కామారెడ్డికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ చట్టాలను పగడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుందరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఆయన కార్యాలయంలో విజయక్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలోని ప్రాంతాల వారీగా ఉన్న పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సైజ్ చట్టాలను అమలు చేయడం, జరుగుతుందన్నారు.
చట్టాలను అధిగమించి లేదా ఉపక్రమించి కల్లు ముస్తేదారులు, వైన్స్ వ్యాపారులు తమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సిబ్బంది కూడా వారికి నిర్దేశించిన పనులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఎక్కడ తేడా వచ్చిన చట్ట పరిధిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మధ్యo ,కల్లు విక్రయించే వ్యాపారస్తులు చట్ట పరిధిలో విక్రయాలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి ముకుంద రెడ్డిని కిందిస్థాయి అధికా రులు స్వాగతం పలికి అభినందించారు.






