బోధన్ డివిజన్ ప్రజావాణి కి 4 ఫిర్యాదులు నమోదు.
- ప్రజావాణిలో అధికారులు సమయపాలన పాటించట్లేదు.
10:30 కి రావాల్సిన అధికారులు 11 తర్వాత వస్తున్నారు.
- ఫిర్యాదుదారులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
ప్రజావాణి కి ఫిర్యాదు దారులు ఆధార్ కార్డు, తప్పనిసరిగా తీసుకొని రావాలని ఆర్డిఓ. ఎం.విజయ్ కుమారి తెలిపారు.
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ ప్రజావాణి లో బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రోజున ఉదయం ఎం.విజయ కుమారి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. నిజం ప్రజావాణిలో 4 దరఖాస్తులు నమోదు అయ్యాయి. మునిసిపల్ పరిధి లో హౌస్ నంబర్ అలాట్మెంట్ గురించి, డ్రైనేజీ సమస్య, విద్యాశాఖ లో స్కూల్ ఫీజు సమస్య, రైతు బంధు గురించి, ఇందిరమ్మ ఇల్లు బిల్లులు, డెత్ సర్టిఫికెట్, భూమి సమస్యలు మొదలగు సమస్యల పైన ప్రజలు తమ సమస్యలని ప్రభుత్వం దృష్టి కి తీసుకువచ్చారు.






