24 February, 2026 | 1:08 PM

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

24-02-2026 01:07 AM

నిజాంసాగర్, ఫిబ్రవరి 23( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగంగా పిట్లం గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు సోమవారం అందజేశారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వమే అండగా ఉంటుందన్న భరోసాను కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుమ్మరి శేఖర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి , నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.