1 May, 2026 | 3:33 AM

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

01-05-2026 12:58 AM

చర్ల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మండల కేంద్రం లోని రైతు వేదికలో  కల్యాణ లక్ష్మ చెక్కులను గురువారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఈ పథకం వరంలాంటిది అన్నారు. అర్హులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల వ్యాప్తంగా 51మంది  అర్హులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం మండల అధికకారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారుల భేటీలో.. 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రజలకు చేరువలో ఉండాలన్నారు. మండలంలో సర్పంచులు సెక్రటరీల సహకారంతో సమస్యలను పరిష్కరించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఈదయ్య, సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.