కల్లూరు బస్టాండులో ఓఆర్‌ఎస్ పాకెట్ల పంపిణీ
ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి ఉపశమనం
కల్లూరు, మే 4 (విజయక్రాంతి): వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు,ఆర్టీసీ సిబ్బందిని వడదెబ్బ నుండి రక్షించేందుకు కల్లూరు బస్టాండులో ఓఆర్‌ఎస్ పాకెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవ్య కాంత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వేసవిలో వడదెబ్బ నివారణ కోసం కల్లూరు బస్టాండులో ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. వడదెబ్బ నివారణలో ఓఆర్‌ఎస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని వారు వివరించారు.ఒక ఓఆర్‌ఎస్ ప్యాకెట్ను ఒక లీటర్ నీటిలో కలిపి సేవించడం వల్ల శరీరానికి అవసరమైన నీరు,లవణాలు తిరిగి అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విలేజ్ బస్సు ఆఫీసర్ కిన్నెర ఆనందరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.






