మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్
పాయం సమక్షంలో లింగగూడెం గ్రామపంచాయతీ నుండి చేరికలు
గుండాల, మే 4 (విజయక్రాంతి): మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే ఖదీర్ అధ్యక్షతన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ లింగగూడెం గ్రామపంచాయితీకి చెందిన కుంజ రామస్వామి (3వ వార్డు సభ్యులు)తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు కల్తి రామకృష్ణ దొర, కల్తి ఆదినారాయణ, కుంజ శ్రీను, కుంజ క్రిష్ణయ్య, ఇర్ప వీరస్వామితో సహా మొత్తంగా 15 కుటుంబాలు సోమవారం కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మెచ్చి, మా ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుచుకోవాలనే ఉద్దేశ్యంతో అలాగే పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే పాయం వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని, ప్రజల ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీని వేదికగా ఎంచుకున్నందుకు అభినందించారు. పినపాకలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య, ఏఎంసీ డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దార అశోక్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, పడుగోనిగూడెం సర్పంచ్ ఈసం సంజీవరావు, మండల నాయకులు జోగ రమేష్, మండలోజు కిరణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






