18 April, 2026 | 4:06 PM

Breaking News

మహిళా సాధికారతకు కాంగ్రెస్సే అడ్డంకి..   •   కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి   •   ఇందిరా క్రాంతి వివోఏలకు ఉద్యమం రిజిస్ట్రేషన్ పై అవగాహన   •   మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ   •   మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •  

ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ

13-06-2025 01:49 AM

అశ్వాపురం, జూన్ 12(విజయ క్రాంతి):మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్,డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు గురువారం అశ్వాపురంలో రైతులకు 80 శాతం సబ్సిడీ పై పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ , మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అశ్వాపురం మండలంలో దాదాపు 400 ఎకరాలు సాగుతుండగా విస్తీర్ణం భారీ గా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లను వినియోగించుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులు పిలుపునిచ్చారు.

మొక్కలకే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై కూడా సబ్సిడీ వస్తుందన్నారు. అంతే కాకుండా ఎకరానికి రూ 4,200 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది. అంతర్గత పంటలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు వికాస్, ప్రవీణ్ మరియు రైతులు ఓరుగంటి బిక్ష్మయ్య, గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు,ఈదర అప్పారావు, కందుల ప్రసాదరావు, ముప్పారపు సత్యనారాయణ, రాయల కృష్ణ, కోటయ్య, తదితరులు పాల్గొన్నారు.