19 March, 2026 | 2:24 AM

పైపులు, స్ప్రింక్లర్స్ పంపిణీ

18-07-2025 12:00 AM

దేవరకొండ, జులై 17: దేవరకొండ పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రముల శాఖ వారు ఏర్పాటు చేసిన సూక్మ సేద్యం పరికరాలు ( పైపులు,స్ప్రింక్లర్స్) లను 18 మంది లబ్ధిదారులకు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు స్ప్రింక్లర్ లను సద్వినియోగం చేసుకొని, ఆర్ధికంగా ఎదగాలని కోరారు.

ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఉన్నాయని ,వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.