18-07-2025 12:00:00 AM
ఆలేరు, జూలై 17 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఇందిరమ్మ మహిళ శక్తి సంబరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య , ఎమ్మెల్సీ నేలికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంత రావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా సంఘ సభ్యులకు వడ్డీలేని రుణాల చెక్కులను, మహిళా సంఘ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ప్రజా పాలనలో మహిళలకు స్వయం శక్తి ఉపాధి అవకాశాలు కల్పించే దశగా పెట్రోల్ బంకులు, బస్సు ఓనర్లుగా తీర్చి దిశగా, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులేస్తుందని ఆయన అన్నారు.
మహిళా సంఘ సభ్యులకు ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళలకు కుటుంబానికి10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా తిగా నే పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య రెడ్డి, పద్మ, రేణుక, అధికారులు, మహిళా సంఘం నాయకులు, సంఘ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.