18-07-2025 12:00:00 AM
నూతనకల్ జూలై 17 : మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా చేసిన ఈజిఎస్ పనులను గురువారం కేంద్ర బృందం పరిశీలించారు, ఈ సందర్భంగా కేంద్ర మానిటరీ సభ్యులు సలీం కుమార్, సలేమున్ లు పల్లె ప్రకృతి వనాలు,నర్సరీలు,సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, కంపోజ్ పిట్, హరితహారంలో నాటిన మొక్కలు,రైతు వేదికలు, సెగ్రికేషన్ షెడ్లు, పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో సునీత ఏ పీ ఓ శ్రీరాములు తదితరులు ఉన్నారు.