17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అంగన్వాడి కేంద్రంలో ఎల్ ఎస్ డబ్ల్యూ ఎస్ ద్వారా పలకల పంపిణీ

04-06-2025 07:42 PM

ముఖ్యఅతిథిగా టూ టౌన్ సిఐ..

కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం పాత పోలీస్ స్టేషన్, నెహ్రూ బస్తి, సమీపంలోని, నాలుగు అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు పలకల పంపిణీ జరిగింది. బుధవారం తంజావూరి కీర్తన పుట్టినరోజు సందర్భంగా లైట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ(Light of Social Welfare Society) ప్రధాన కార్యదర్శి గుండ్ల రాజు డేవిడ్ ఆధ్వర్యంలో రామవరం టూ టౌన్ సిఐ ప్రతాప్(Two Town CI Pratap) ముఖ్యఅతిథిగా పాల్గొని సుమారు 40 మంది విద్యార్థులకు, పలకలు, బలపాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లలకి మొదట తల్లి ఒడి తరువాత మొదలయ్యే జీవితం అంగన్వాడి అని పిల్లలు ఇక్కడి నుండే తమ చదువును మొదట ప్రారంభిస్తారని, పిల్లలు మంచిగా చదువుకోవాలని జీవితంలో పైకి రావాలని ఆశీర్వదించారు. ఎల్ ఎస్ డబ్ల్యూ ఎస్,సంస్థ చేస్తున్న కార్యక్రమాలని సంస్థ సభ్యులని అభినందించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్  సబ్ ఇన్స్పెక్టర్, సంస్థ అధ్యక్షులు మర్రి కృష్ణ,, ఉపాధ్యక్షులు తంజావూరీ నరేష్, సహాయ కార్యదర్శి ధర్మపురి నరేష్ అంగన్వాడి టీచర్లు జ్యోతి, రాధిక ఆయాలు భవాని, నిర్మల, ఏఎన్ఎం రాజేశ్వరి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.