18 March, 2026 | 5:10 PM

రంజాన్ సందర్భంగా ‘రంజాన్ తోఫా’ కిట్ల పంపిణీ

18-03-2026 03:58 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ముస్లింలకు ‘రంజాన్ తోఫా’ కిట్లను పంపిణీ చేశారు. మండలంలో ఉన్న 10 మసీదుల పరిధిలో మొత్తం 125 కిట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా నిరుపేద ముస్లిం సోదర సోదరీమణులు నూతన వస్త్రాలతో ఆనందోత్సాహంతో పండుగను జరుపుకోవాలని అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మస్కూర్ కాశిరాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఫాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, తహసీల్దార్ వరలక్ష్మి, గ్రామ అధ్యక్షులు మందాల లింబయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టి రుక్మిణి, చందనగిరి గోపాల్, ప్రభాకర్, దేవరకొండ నరసింహాచారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ పాషా, నాయకులు మూదం ప్రదీప్, సత్యం, మానుక సత్యం, రాస రవీందర్, అనిల్ శేఖర్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్‌ఐ సంతోష్,ముస్లిం సోదర సోదరీమణులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.