అగ్రహారం అంజన్న ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
అభివృద్ధి పనుల పరిశీలన
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ మండలం అగ్రహారం అంజన్న ఆలయంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారంలోని హనుమాన్ ఆలయం వద్ద రూ.60 లక్షలతో ఆర్చి, ప్రాకారం సాలహారంతో కలిసి, కమాన్, ఆలయ ఆవరణలో మార్బుల్ ఫ్లోరింగ్ పనులు కొనసాగుతుండగా కలెక్టర్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఆర్చి, ప్రాకారం సాలహారంతో కలిసి, కమాన్ నిర్మాణం, మార్బుల్ ఫ్లోరింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాల విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశీలనలో పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రెడ్డి, డీఈ విష్ణువర్ధన్, తహసీల్దార్ జయంత్ కుమార్, అగ్రహారం అంజన్న ఆలయ ఈఓ ఉడుతల వెంకన్న తదితరులు ఉన్నారు.




