BIG BREAKING! పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
బండి భగీరథ్ కు హైకోర్టు ఊరట
హైదరాబాద్: పోక్సో(POCSO) కేసులో నిందితుడైన బండి భగీరథ్‌కు(Bandi Bhagirath) తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. బండి భగీరథ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, దర్యాప్తునకు సహకరించాలని భగీరథ్‌కు హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా జామీను సమర్పించాలని కోర్టు సూచించింది. రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని అతన్ని ఆదేశించింది. బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు(POCSO Case) నమోదైంది. మే 16న బండి భగీరథ్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద జరుగుతున్న విచారణలో భాగంగా ఈ ఉత్తర్వు వెలువడింది.






